ఆర్టీసీ ఆదాయం క్రమంగా మెరుగుపడుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో ఆర్టీసీకి తీరని నష్టాలు వాటిల్లాయి. ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.9 కోట్ల ఆదాయం సమకూరుతోందని అధికారులు వెల్లడించారు. ఆక్యూపెన్సీ శాతం సైతం 58 శాతానికి చేరుకుందని వివరించారు.
కోలుకుంటోన్న ఆర్టీసీ... క్రమంగా పెరుగుతోన్న ఆదాయం
టీఎస్ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. కరోనా కారణంగా తీరని నష్టాలపాలైన సంస్థ... తిరిగి గాడిన పడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ. 9 కోట్ల ఆదాయం సమకూరుతోందని అధికారులు తెలిపారు.
కోలుకుంటోన్న ఆర్టీసీ... క్రమంగా పెరుగుతోన్న ఆదాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. కార్గో సేవల ద్వారా ఇప్పటి వరకు 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశామని అధికారులు తెలిపారు. దీనివల్ల ఆర్టీసీకి రూ.22.61 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్శిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందనని సంస్థ పేర్కొంది. రాబోయే రోజుల్లో కార్గో సేవలను మరింత విస్తరిస్తామని అధికారులు తెలిపారు.