తెలంగాణ

telangana

గౌడ వసతి గృహం సర్వసభ్య సమావేశం రసాభాస

హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని గౌడ వసతిగృహం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వసతి గృహ కమిటీలో అర్హులందరికీ సభ్యత్వం కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు. అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనతో సభ అర్ధాంతరంగా ముగిసింది.

By

Published : Apr 18, 2021, 8:00 PM IST

Published : Apr 18, 2021, 8:00 PM IST

Gowda Hostel Plenary Meeting
గౌడ వసతి గృహ అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు రాజీనామా చేయాలని ప్లకార్డులతో నిరసన

గౌడ వసతి గృహం సర్వ సభ్య సమావేశం అర్ధాంతరంగా రద్దయింది. హైదరాబాద్ హిమాయత్​నగర్​లో ఏర్పాటు చేసిన సభలో కొందరు సభ్యులు రాకున్నా వచ్చినట్లు సంతకాలు చేశారని ఆరోపిస్తూ పలువురు సభ్యులు అధ్యక్షునిపై మండిపడ్డారు. కమిటీకి రాజీనామా చేసిన ముగ్గురు సభ్యుల అంశాన్ని ప్రస్తావించకుండా సమావేశం నిర్వహించవద్దని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొవిడ్ నియమాలు పాటిస్తూ సామాజిక దూరం పాటించాలని పోలీసులు సూచించిన సభ్యులు పాటించలేదు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.

కమిటీ అధ్యక్షుడు రాజీనామా చేయాలి:

నకిలీ తీర్మానాలు, దొంగ సంతకాలు పెట్టి హాస్టల్​ను బ్యాంకులో కుదువ పెట్టిన గౌడ వసతి గృహ అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు రాజీనామా చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతూ సంతకాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహస్తున్నారని గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలరాజ్​ గౌడ్ ఆరోపించారు. హాస్టల్ కమిటీ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల 60 లక్షల రూపాయలను స్వాహా చేసిన లక్ష్మణ్ రావు రాజీనామా చేయాలన్నారు.

ముందుగానే సమాచారం ఇచ్చాం: లక్ష్మణ్​ రావు

గౌడ కులాల సమన్వయ కమిటీ నియమాల ప్రకారం సభ్యులందరికీ సమాచారం ముందుగానే చేర వేసినట్లు వసతి గృహం కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. తమ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమం కోసం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉప్పల్​లో గౌడ వసతిగృహం కోసం ఆన్​లైన్​లో భూమి కొనుగోలు చేయడం జరిగిందని...భవన నిర్మాణానికి అనేక మంది విరాళాలు అందజేశారని లక్ష్మణ్​ గౌడ్​ వివరించారు.

ఇదీ చూడండి:జీహెచ్​ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details