తెలంగాణ

telangana

ETV Bharat / state

భూసంస్కరణలపై వేగం పెంచిన సర్కార్

భూసంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. భూ యాజమాన్య హక్కుల కల్పనలో పారదర్శకత, ఒకేచోట సేవలు, ప్రక్రియలో వేగం, అవినీతికి అడ్డుకట్ట వంటి అంశాలతో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వేగం పెంచిన సర్కార్

By

Published : Aug 20, 2019, 5:56 AM IST

Updated : Aug 20, 2019, 7:44 AM IST

వేగం పెంచిన సర్కార్

ఈరోజు, రేపు కొత్త రెవెన్యూ చట్టంపై జరిగే సమావేశాల్లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూసంస్కరణలపై లోతుగా చర్చించనున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా తాజాగా కొత్త రెవెన్యూ చట్టం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. భూమిపై ఆధారపడి జీవించే రైతులకు ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందించి యాజమాన్య భరోసా కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది.

ఆర్​ఓఆర్​ చట్టమే ఇంకా...

రాష్ట్రంలో 1971లో ఏర్పాటు చేసుకున్న ఆర్‌ఓఆర్‌ చట్టం అమలులో ఉంది. ఇది భూ దస్త్రాలపైనే హక్కులను కల్పిస్తోంది. ఈ చట్టం స్థానంలో భూములపై పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే కన్‌క్లూజివ్‌ ఆఫ్‌ టైటిల్‌ చట్టం అమలు చేయడానికి వీలున్న మార్గాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ చట్టంలో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూప్రాధికార సంస్థలు, చట్టం అమలుకు నిర్దిష్ట వ్యవధి, బీమా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై ఉన్నతాధికారులు ఇప్పటికే అధ్యయనం చేపట్టారు.

నమూనా సర్వే..

రాష్ట్రంలో 1932లో నిర్వహించిన భూముల సర్వేతోనే భూ దస్త్రాలు కొనసాగుతున్నాయి. అనంతర కాలంలో సర్వే చేపట్టినా.. పూర్తి స్థాయిలో లక్ష్యం చేరుకోలేదు. కొత్త చట్టాలు తీసుకొచ్చినా.. సర్వేతోనే క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం పూర్తవుతుందన్న అభిప్రాయం ఉంది. ఎల్‌ఆర్‌యూపీ చేపట్టే ముందు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నమూనా భూసర్వే చేపట్టారు.

ఒకేచోట సేవలు..

తహసీల్దార్ కార్యాలయం వేదికగా భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, విరాసత్‌ లాంటి సేవలన్నింటినీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 22 తహసీల్దార్​ కార్యాలయాల్లో నమూనా సేవలు ప్రారంభించింది. తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్‌ అధికారాలను అప్పగించింది. ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్​ విధులు సాధ్యం కాదు. అందుకే కొత్త చట్టంతో ఒకే చోట సేవలను అందుబాటులోకి తేనుంది. ఇదే క్రమంలో రెవెన్యూ శాఖను పునర్​వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పేరుకుపోయిన భూవివాదాల పరిష్కారానికి జిల్లాస్థాయిలో భూట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఇదీ చూడండి: సీఎస్​ ఎస్కే జోషికి ఉత్తమ్​ వినతిపత్రం

Last Updated : Aug 20, 2019, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details