బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 1698 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల్లో 36 ప్రిన్సిపల్, 1071 టీజీటీ, 119 పీఈటీ పోస్టులున్నాయి. 119 లైబ్రేరియన్, క్రాఫ్ట్ ఆర్ట్ మ్యూజిక్ టీచర్లు, స్టాఫ్ నర్సుల పోస్టులతో పాటు 110 జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, మరో ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా - bc
బీసీ గురుకులాల్లో 1698 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సర్కార్ పచ్చజెండా