తెలంగాణ ప్రజల సంక్షేమం, బాగోగులు తనకు అత్యంత ప్రాధాన్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల పట్ల అణుక్షణం తన తపన అలానే ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. ఇవాళ పుదుచ్చేరి నుంచి రాష్ట్ర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ రాజ్‌భవన్ అధికారులతో చర్చించారు.
'పుదుచ్చేరిలో ఉన్నా... తెలంగాణ అభివృద్ధి కోసమే నా తపన'
పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్ అధికారులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్ష నిర్వహించారు. గవర్నర్ సలహాదారులు, సంయుక్త కార్యదర్శులు, రాజ్‌భవన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'పుదుచ్చేరిలో ఉన్నా... తెలంగాణ అభివృద్ధి కోసమే నా తపన'
గవర్నర్ సలహాదారులు, సంయుక్త కార్యదర్శులు, రాజ్‌భవన్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించినప్పటికీ... తెలంగాణకు సంబంధించిన విషయాలు, పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని గవర్నర్ చెప్పారు. రాజ్‌భవన్ అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటానని, అవసరమైన విషయాలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి :న్యాయవాదుల నిరసనలో ఉద్రిక్తత.. లాయర్‌పై వ్యక్తి దాడి
Last Updated : Feb 19, 2021, 5:43 PM IST