తెలంగాణ

telangana

ETV Bharat / state

మెడికల్​ కాలేజీలు మరింత బాధ్యతగా ఉండాలి : తమిళి సై​

కొవిడ్​-19 పై పోరాటంలో మెడికల్​ కాలేజీలు మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్​ తమిళి సై సౌందర రాజన్​ అన్నారు. రాజ్​ భవన్​ నుంచి కాళోజీ నారాయణరావు వర్సిటీ అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

Governor Video Conference With Kaloji Medical University VC
మెడికల్​ కాలేజీలు మరింత బాధ్యతగా ఉండాలి : గవర్నర్ తమిళి సై​

By

Published : Jun 29, 2020, 11:03 PM IST

రాష్ట్రంలోని మెడికల్​ కాలేజీలు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత బాధ్యతగా ఉండాలని గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ అన్నారు. రాజ్​ భవన్​ నుంచి ఆమె కాళోజీ నారాయణ రావు వర్సిటీ అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మెడికల్​ సీట్లు పెంచేందుకు కృషి చేయాలన్నారు. కరోనా నివారణలో భాగంగా.. మెడికల్ కాలేజీలు తమ పరిధిలో ప్రజలకు చేరువై పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించాలని గవర్నర్ సూచించారు. కొవిడ్​పై పోరాటంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విశేషమైన కృషి చేస్తున్నారని.. వారిని బాగా చూసుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. వైద్య సిబ్బంది మానసిక స్థయిర్యాన్ని పెంపొందించాలన్నారు.

నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కేవలం 4,790 ఎంబీబీఎస్​ సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈ సీట్ల సంఖ్యను పెంచడానికి తగిన అనుమతుల కోసం కృషి చేయాలన్నారు. కొవిడ్ వంటి వైరల్ సమస్యలపై మరింత విస్తృత పరిశోధనలను ప్రోత్సహించి.. ఆ డేటాబేస్ తయారు చేసుకొని అందరికీ అందుబాటులోకి తేవాలని గవర్నర్​ సూచించారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్ సైన్సెస్​ వైస్​ ఛాన్స్​లర్​ కరుణాకర్​ రెడ్డి, రిజిస్ట్రార్​, గవర్నర్​ సెక్రటరీ సురేంద్ర మోహన్​, సంయుక్త కార్యదర్శులు భవానీ శంకర్​, సిఎన్​ రఘు ప్రసాద్​, అనుసందాన అధికారి సీహెచ్​ సీతారాములు, డా.రాజారాం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ABOUT THE AUTHOR

...view details