మహాశివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మహాశివరాత్రి... మేల్కొనే రాత్రి, మేల్కొలుపు రాత్రిని సూచిస్తుందని అన్నారు. అత్యంత దయగల దేవుడు శివుడు అని... లక్షలాది మంది భక్తులకు ముఖ్యమైన పండుగల్లో ఇదొకటని గుర్తు చేశారు. ఈ మేరకు గవర్నర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శివరాత్రి జరుపుకోండి: తమిళిసై
శివరాత్రి పండుగ మనలో భక్తి, ఆప్యాయత, స్నేహం వంటి ఆలోచనలను ప్రేరేపిస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో నిబంధనలకు కట్టుబడి ఈ పండుగను జరుపుకోవాలని కోరారు.
మహాశివరాత్రి... మేల్కొలుపు రాత్రిని సూచిస్తుంది: తమిళిసై
విశ్వ ప్రాముఖ్యత ఉందని నమ్ముతున్న మహాశివరాత్రిని ఉత్సాహం, భక్తి శ్రద్ధాసక్తులతో హిందువులు జరుపుకుంటారని అన్నారు. ఈ పండుగ మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం వంటి గొప్ప ఆలోచనలను ప్రేరేపిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్-19 నేపథ్యంలో నిబంధనలకు కట్టుబడి ఈ పండుగను జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్