తెలంగాణ

telangana

ETV Bharat / state

మనం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటే కారణం వాళ్లే: తమిళిసై - విద్యపై గవర్నర్ తమిళిసై

Governor Tamilisai Comments : సికింద్రాబాద్‌లో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న 36 మంది విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

By

Published : Dec 15, 2022, 12:37 PM IST

Governor Tamilisai Comments : సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 36 మందికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌.. భారత సైనికుల ధైర్యసాహసాలు, సేవలు ఎనలేనివని కొనియాడారు.

చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత్‌ సైన్యం గట్టిగా బదులిచ్చిందన్న ఆమె.. ఇంత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటే అందుకు మన సైనికులే కారణమన్నారు. నేర్చుకోవడం అన్నది ఒక విషయంతో ఆగదన్న గవర్నర్‌.. సాంకేతికంగా కూడా మన సైనికులు ఎంతో ముందున్నారని కొనియాడారు.

''భారత సైనికుల ధైర్యసాహసాలు, సేవలు ఎనలేనివి. చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. సాంకేతికంగా కూడా మన సైనికులు ఎంతో ముందున్నారు. సైనికుల వల్లే ఇంత ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం.'' -తమిళిసై, తెలంగాణ గవర్నర్‌

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగం

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details