తెలంగాణలో గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. రెండు రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను ఎలా నిర్వహిస్తారని నాపై అనుమానం వ్యక్తం చేశారని ఆమె గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రపంచ రోడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చిన మాతృమూర్తులకు బహుమతులు అందించారు. చిన్నారులను స్వయంగా ఎత్తుకుని ముద్దాడారు.
పాత కొత్త తరాలను కలుపుతూ ఇటివలే మాతృత్వాన్ని పొందిన మహిళలతో పాటు 60 ఏళ్లు పైబడిన తల్లులతో కలిసి గవర్నర్ వేడుకలు నిర్వహించారు. మాతృత్వపు గొప్పతనాన్ని తమిళిసై వివరించారు. ఉద్యోగంతో పాటు పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించాలని కోరారు. ఇటీవలే తన తల్లిని కోల్పోయానని. ఇక్కడికి వచ్చిన మాతృమూర్తుల్లో ఆమెను చూసుకుంటున్నట్లు తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు.
కొవిడ్ విపత్తు వేళ విలువైన సేవలందించిన రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అభినందనలు. ట్విట్టర్, వాట్సాప్‌లో అభ్యర్థనలు వచ్చినప్పుడు... రెడ్‌క్రాస్ వారియర్స్ నా వెనుక ఉండటం వల్లే.. అర్ధరాత్రి సమయంలోనూ వారికి సాయం చేయగలిగాం. వేలాది మందికి సాయం చేయగలిగాం. లౌక్‌డౌన్ సమయంలో తలసేమియా బాధితులకు అండగా నిలిచాం. ఇందుకు సహకరించిన పోలీసులు, ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు. చాలా మంది చిన్నారులకు రక్తం అందింది. ఎదుటివారితో దయతో, మానవత్వంతో మెలగాలి.