రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) , సీఎం కేసీఆర్(CM KCR) దీపావళి శుభాకాంక్షలుతెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి చాటి చెప్పేలా స్థానిక ఉత్పత్తులతోనే దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ (Governor Tamilisai) సూచించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే దీపావళి పండుగ అన్నారు. దీపావళి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో చీకట్లను పారద్రోలి కొత్త కాంతులు విరజిమ్మేలా ఆనందం, సంతోషాలను తీసుకొస్తుందని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని తమిళిసై(Governor Tamilisai) పిలుపునిచ్చారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, శ్రేయస్సు, కొత్త ఆదర్శాలను తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు ఆనందంగా పండుగను జరుపుకోవాలని కోరారు. అందరు కూడా కరోనా టీకా రెండు డోసులు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి చేశారు.