మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్ భవన్లోని ఉద్యోగినులతో.. గవర్నర్ తమిళిసై జరిపిన సంభాషణ ఆసక్తికరంగా కొనసాగింది. ప్రస్తుతం పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తోన్న సౌందరరాజన్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి రాజ్ భవన్ ఉద్యోగినులతో ముచ్చటించారు.
తోటమాలి, వంట మనిషి మొదలుకొని పలు విభాగాల్లో పనిచేస్తోన్న ఉద్యోగినులు.. గవర్నర్తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైనందుకుగాను తమిళిసైకు.. వారు శుభాకాంక్షలు తెలియజేశారు.