జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌లో అవకతవకలు జరిగాయని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆరోపించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని వెల్నెస్ సెంటర్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లలో మందుల కొరత ఉందని తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో గడువు ముగిసిన మందులే ఉన్నట్లు వారు గుర్తించారు.
"ఈజేహెచ్ఎస్'లో అవకతవకలపై విచారణ జరపాలి"
ఈజేహెచ్ఎస్ స్కీమ్‌కి సంబంధించి మందుల కొనుగోళ్లలో అవకతవకలపై విచారణ జరపాలని కోరుతూ సీపీఎం ఆందోళనకు దిగింది. ఖైరతాబాద్‌లోని వెల్నెస్ సెంటర్‌ను ముట్టడించింది.
ఈజేహెచ్ఎస్ వెల్నెస్ సంటర్లలో మందుల మోసం: సీపీఎం