తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి పరీక్షలపై సర్కారు కీలక నిర్ణయం.. ఈసారీ 6 పేపర్లతోనే..

పదో తరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేందుకు సర్కారు నిర్ణయం
పదో తరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేందుకు సర్కారు నిర్ణయం

By

Published : Oct 13, 2022, 8:07 PM IST

Updated : Oct 13, 2022, 8:25 PM IST

20:05 October 13

పదో తరగతి పరీక్షలపై సర్కారు కీలక నిర్ణయం.. ఈసారీ 6 పేపర్లతోనే..

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు.. 6 పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కరోనా వ్యాప్తి సమయంలో 2021 ఏడాది 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది కోవిడ్ ఉద్ధృతి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. 2022లో 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించింది.

ఇప్పుడు 2023లోనూ ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రతి ఏడాది ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధివిధానాలు మారుస్తూ.. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్ 1 నుంచి పదో తరగతికి మొదటి సమ్మేటివ్ అసెస్మెంట్​ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది.

ఇవీ చూడండి..

14ఏళ్ల యోగా టీచర్.. ఒకేసారి రెండు పీహెచ్​డీలు.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా!

తెరాసను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా: కేటీఆర్‌

Last Updated : Oct 13, 2022, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details