తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం - telangana governmenr announces Classification of posts

పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

By

Published : Apr 25, 2022, 6:45 PM IST

Updated : Apr 25, 2022, 7:48 PM IST

18:43 April 25

పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

గ్రూప్-1 నియామక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్​కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా ఒక్కో ఖాళీకి 50 మంది చొప్పున అభ్యర్థులను మెయిన్స్​కు ఎంపిక చేయనున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు విధివిధానాలు స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు రద్దు చేసిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేశారు. టీఎస్​పీఎస్సీ సవరణలను పొందుపరుస్తూ అన్ని అంశాలతో సాధారణ పరిపాలనాశాఖ వివరణాత్మక ఉత్తర్వును జారీ చేసింది.

గ్రూప్​-1లో 19 రకాల పోస్టులు ఉండగా.. 900 మార్కులతో రాతపరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీతో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రాథమిక పరీక్ష... మెయిన్స్​లో భాగంగా క్వాలిఫయింగ్ కోసం ఆంగ్లంతో పాటు ఆరు పేపర్లకు 150 మార్కుల చొప్పున పరీక్షలు ఉంటాయి. గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉండగా... 600 మార్కులకు నాలుగు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్-3లో 8 రకాల పోస్టులు ఉండగా... 450 మార్కులతో మూడు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 300 మార్కులకు రెండు పేపర్లలో రాతపరీక్ష ఉంటుంది.

తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్స్​లో లేని ఇతర ఉద్యోగాల నియామక పరీక్షా విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జిల్లా సైనిక సంక్షేమాధికారి, సూపర్ వైజర్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్ లేటర్, సీనియర్ రిపోర్టర్, ఇంగ్లీష్ రిపోర్టర్ ఉద్యోగాల పరీక్షా విధానాన్ని ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2022, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details