తెలంగాణ

telangana

ETV Bharat / state

వాద్యాల ప్రదర్శనను తిలకించిన గవర్నర్​ తమిళిసై - hyderabad

మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ సందర్శించారు. ప్రముఖ చరిత్రకారులు ఆచార్య జయధీర్​ తిరుమలరావు ఆధ్వర్యంలో  'ఆది ధ్వని' పేరుతో ఏర్పాటు చేసిన వాద్యాల ప్రదర్శనను తిలకించారు. ఆదివాసీ, జానపదాలకు చెందిన 123 సంగీత పరికరాలను గవర్నర్ పరిశీలించారు.

వాద్యాల ప్రదర్శనను తిలకించిన గవర్నర్​ తమిళిసై

By

Published : Nov 12, 2019, 7:30 PM IST

Updated : Nov 12, 2019, 9:21 PM IST

ఆదివాసీ జీవితాలకు, వారి కళాసాంస్కృతిక రంగానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైవిధ్యభరితమైన దేశీయ సంగీతాన్ని కాపాడుకోనట్లయితే అది కాలగర్భంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 'ఆదిధ్వని' పేరిట ఏర్పాటు చేసిన ఆదివాసీ, జానపదాలకు చెందిన 123 సంగీత పరికరాలను గవర్నర్ పరిశీలించారు. అక్కడ ప్రదర్శించిన వాద్యాల గురించి తెలుసుకోవడంతో పాటు స్వయంగా వాటిని వాయించారు.

మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం: గవర్నర్​

జానపద, గిరిజన ప్రాచీన వాద్యాలను బతికించడం అత్యవసరమైన ఇలాంటి కాలంలో ఇలాంటి సేకరణ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఆదిధ్వని వారు సేకరించిన వందలాది వాద్యాలను ప్రదర్శనశాలలో ఉంచేందుకు సాయం చేస్తానని హమీ ఇచ్చారు. త్వరలోనే ఆదిధ్వని నిర్వాహకులతో సమావేశమై మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. వాద్యాల ప్రదర్శనను చూసి సంతోషించిన గవర్నర్... రుంజ, తోటి బుర్రవాద్యం, కిక్రి, కోయడోలు కళాకారులను సన్మానించారు.

వాద్యాల ప్రదర్శనను తిలకించిన గవర్నర్​ తమిళిసై

ఇవీ చూడండి: గురునానక్​ జయంతి ఉత్సవాల్లో కేటీఆర్​

Last Updated : Nov 12, 2019, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details