ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ రంగానికి ఎంతో భవిష్యత్తు ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలోనూ బయో టెక్నాలజీ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బయోటెక్నాలజీ విభాగంలో నిధులు పుష్కలంగా ఉన్నాయని.. వాటిని యువశాస్త్రవేత్తలు పరిశోధనల కోసం వినియోగించుకోవాలని ఆమె సూచించారు. డీపీటీ, బీసీజీ, మశూచీ టీకాల ఉత్పత్తిలో మన దేశం గ్లోబల్ లీడర్‌గా ఉందన్నారు.
'ఫార్మా, బయోటెక్ రంగాల్లో తిరుగులేని శక్తిగా హైదరాబాద్' - corona virus
కరోనా వ్యాక్సిన్ తయారీలో బయోటెక్నాలజీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్‌పై జేఎన్టీయూహెచ్ నిర్వహించిన జాతీయ వెబినార్‌ను గవర్నర్ ప్రారంభించారు. బయోటెక్నాలజీ విభాగంలోని నిధులను యువశాస్త్రవేత్తలు వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు.
'ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది'
ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్‌పై జేఎన్టీయూహెచ్ నిర్వహించిన జాతీయ వెబినార్‌ను గవర్నర్ ప్రారంభించారు. సదస్సులో జేఎన్టీయూహెచ్ వీసీ జయేష్ రంజన్, రిజిస్ట్రార్ మన్జూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పౌరహక్కుల నేత వరవరరావుకు కరోనా పాజిటివ్