వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఫీవర్ అస్పత్రుల్లోనూ కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో రేపటి నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది.
'మాస్కులు, శానిటైజర్లు అధిక ధరలకు అమ్మకుండా నిఘా' - హైకోర్టు వార్తలు
16:09 March 12
హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు ఓ బృందం వెళ్లిందని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. అధిక ధరలకు మాస్క్‌లు శానిటైజర్లు విక్రయిస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. అధిక ధరలకు అమ్మకుండా నిఘా పెట్టామని ఏజీ వివరించారు. రాష్ట్రంలో రోజుకు 500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యముందని ఐపీఎం డైరెక్టర్ శంకర్ తెలిపారు.
కేరళ చర్యల్లో అనుసరమైనవి చెప్పండి:
దేశవ్యాప్తంగా 44 కరోనా కేసులు నమోదైనట్లు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. కేరళ చేపట్టిన చర్యల్లో అనుసరమైనవి తెలిపాలని హైకోర్టు సూచించింది. మరిన్నీ వివరాలతో ఈ నెల 23లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి:'పారాసెటమాల్తోనే కరోనాకు చికిత్స!'