సచివాలయం కూల్చివేతపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. నిజాం తన పేరు చిరకాలం ఉండాలని చార్మినార్, అసెంబ్లీ నిర్మిస్తే.. కేసీఆర్ తన పేరు చిరకాలం నిలిచిపోవాలనే పాత సచివాలయాన్ని కూల్చివేసి.. కొత్తది నిర్మిస్తున్నారని విమర్శించారు.
కొత్త సచివాలయంపై రాజాసింగ్ గరం గరం - ఎమ్మెల్యే రాజాసింగ్ తాజా వార్తలు
సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. కేవలం తన పేరు చిరకాలం నిలిచిపోవాలనే దురుద్దేశంతోనే కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపించారు.
కొత్త సచివాలయం నమూనా మసీదులా ఉంది: రాజాసింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని రాజాసింగ్ మండిపడ్డారు. 50 ఏళ్ల వరకు సచివాలయ భవనాలు పని చేస్తాయని నిపుణులు సూచించినా.. కేవలం తన పేరు కోసమే సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాతో ప్రజలు చనిపోతున్న ఈ తరుణంలో.. కొత్త సచివాలయాన్ని నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు.
ఇదీచూడండి: నిమ్స్‌లో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Last Updated : Jul 7, 2020, 12:26 PM IST