మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా... మీ కుటుంబంలో ఇబ్బందులున్నాయా... వ్యాపారంలో నష్టపోతున్నారా... మీ చేతికి ఉన్న బంగారు ఉంగరం నా చేతిలో ఉన్న గిన్నెలో వేయండి. దానిని రెండుగా చేసి మీ చేతిలో పెడతాను అంటూ బంగారం కాజేసే ముఠా సికింద్రాబాద్లో సంచరిస్తుంది. మోసాలపై బాధితులు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలకు మాయమాటలు చెప్పి బంగారం కాజేస్తోన్న ముఠాపై వరుస ఫిర్యాదులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగల ఆచూకీని తెలుసుకునేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రెండ్రోజుల క్రితం కొందరు వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి... మహంకాళి పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు బాలుడున్నట్లు సమాచారం. వీరు తెలుపు రంగు బట్టలు ధరించి తిరుగుతున్నారని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మాయమాటలతో బంగారం దోచేస్తోన్న ముఠా అరెస్టు - బంగారం దొంగల ముఠా అరెస్టు
వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన సికింద్రాబాద్లో ప్రజలకు మాయమాటలు చెప్పి బంగారం కాజేస్తోన్న ముఠాపై వరుస ఫిర్యాదులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి కొందరు వ్యక్తులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు దొంగల ముఠా
ఇదీ చూడండి : స్మృతి అనుచరుడి హత్య కేసులో ముగ్గురి అరెస్టు