తెలంగాణ

telangana

ETV Bharat / state

గణపయ్యకు బంగారు లడ్డు - తదీ్ ుోలాేప

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ కొల్లాపూర్​కు చెందిన భగత్​సింగ్ యూత్ సభ్యులు అందరిలా కాకుండా విభిన్నంగా బంగారు లడ్డు తయారు చేయించారు. ఈ నెల11న లడ్డు వేలం వేయనున్నట్లు వారు తెలిపారు.

గణపయ్యకు బంగారు లడ్డూ

By

Published : Sep 8, 2019, 1:49 PM IST

వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డుకు ఎంతో విశిష్టత ఉంది. భక్తులు పోటీపడి మరి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం వారిలో ఉంటుంది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కొల్లాపూర్​లోని శ్రీ సిద్ధి వినాయక భగత్​సింగ్ యూత్ సభ్యులు అందరిలాకాకుండా వినూత్నంగా 12తులాల 3గ్రాముల బంగారు లడ్డు తయారుచేయించారు. వీరు గత ఏడాది కూడా బంగారు లడ్డు పెట్టినట్లు తెలిపారు. ఈనెల 11న వేలం వేయనున్నామని అందరూ పాల్గొనాలని కోరారు.

గణపయ్యకు బంగారు లడ్డూ

ABOUT THE AUTHOR

...view details