కాళేశ్వరం జలాలను వచ్చేవారం సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది. అక్కడ ఇప్పటికే ఆరు పంపులు సిద్ధం కాగా... నాలుగింటిని ఆటోమోడ్లో నడిచేలా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి అన్నారంకు చేరుతున్న జలాలను... పంపుహౌస్ నుంచి సుందిళ్లకు ఎత్తిపోస్తున్నారు. సుందిళ్ల ఆనకట్టలో నీటిమట్టం పెరిగి పంపుహౌస్ ఫోర్‌బేలోకి నీరు చేరాల్సి ఉంది. ఫోర్‌బేలో కనీస మట్టానికి నీరు చేరిన తరువాత ఆరు పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించనున్నారు.
ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 4.45 టీఎంసీల నీరు నిల్వ ఉండగా... కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఇప్పటి వరకు 10.172 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. అన్నారం పంపుహౌస్ ద్వారా 3.11 టీఎంసీల నీటిని సుందిళ్ల జలాశయంలోకి తరలించారు. అక్కడ నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఐదో పంపును కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుందిళ్ల జలాశయంలో ప్రస్తుతం 3.471 టీఎంసీల నీరు ఉంది. సుందిళ్ల పంపుహౌస్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి వచ్చేవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు తరలించాలని భావిస్తున్నారు.
సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి వచ్చేవారం నీటి తరలింపు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అన్నారం నుంచి సుందిళ్లకు చేరుతున్న నీటిని వచ్చేవారం ఎల్లంపల్లికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సుందిళ్ల జలాశయంలో ప్రస్తుతం 3.471 టీఎంసీల నీరు ఉంది. ఇక్కడ నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు... ఐదో పంపును కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు
ఇదీ చూడండి : ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి మరో జలపాతం