ఫిర్యాదులు అందిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు సహా ఇతర అంశాలపై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖల కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, ఇతర సభ్యులు పాల్గొంటారు.
నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ - తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖల కార్యదర్శులు
నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల నీటి పారుదల శాఖల కార్యదర్శులు, ఇతర సభ్యులు హాజరుకానున్నారు.
అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, గోదావరి మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకుల గూడెం ఆనకట్ట, తాగునీటి సరఫరా ప్రాజెక్టు సహా పెన్‌గంగపై ఆనకట్టలు, రామప్ప-పాకాల మళ్లింపు పథకాలను చేపట్టిందని ఏపీ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టులతోపాటు గతంలో రెండు రాష్ట్రాలు లేవనెత్తిన ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల విషయమై సమావేశంలో చర్చ జరగనుంది. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ, గోదావరి బేసిన్లో టెలిమెట్రీ ఏర్పాటు సహా ఇతర పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రాలు ప్రస్తావించే అంశాలపై కూడా భేటీలో చర్చ జరగనుంది.
ఇదీ చూడండి :ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్.. పరారీలో తెరాస కౌన్సిలర్