తెలంగాణ

telangana

ETV Bharat / state

బక్రీద్ సందర్భంగా నగరంలో జోరందుకున్న పొట్టేళ్ల విక్రయాలు - భాగ్యనగరం

ఈ నెల 12న బక్రీద్‌ పండుగ సందర్భంగా  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పొట్టేళ్లు, మేకల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

బక్రీద్ సందర్భంగా నగరంలో జోరందుకున్న పోట్టేళ్ల విక్రయాలు

By

Published : Aug 10, 2019, 11:54 PM IST

భాగ్యనగరంలో బక్రీద్‌ వ్యాపారం జోరందుకుంది. పండుగలో భాగంగా ఖుర్బానీ(దేవుడికి బలిదానం) ఇవ్వటం ముస్లింల ఆనవాయితీ. దీనికోసం వ్యాపారులు పొట్టేళ్లు, మేకలను సిద్ధం చేయడం వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపుల షెడ్లలో వ్యాపారం జరుగుతోంది. నగరంలో మేకల, గొర్రెలకు డిమాండ్‌కు కావాల్సిన ఉత్పత్తి తెలంగాణలో లేదని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. పండుగ ముందు రోజు రాత్రి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బక్రీద్ సందర్భంగా నగరంలో జోరందుకున్న పొట్టేళ్ల విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details