తెలంగాణ

telangana

ETV Bharat / state

నాన్నమ్మ మందలించిందని.. ఇంటి నుంచి వెళ్లిపోయింది... - girl

నాన్నమ్మ మందలించిందని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన చిలకలగూడ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నాన్నమ్మ మందలించిందని...

By

Published : Sep 15, 2019, 12:53 PM IST

నాన్నమ్మ మందలించిందని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన చిలకలగూడ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పార్సిగుట్టలో నివాసం ఉంటున్న మనీషా గత రెండు రోజుల నుంచి నానమ్మతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లి పోతున్నట్లు లేఖ రాసింది. తన గురించి వెతకవద్దని.. ఇక ఇంటికి రానని ఆమె లేఖలో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. మనీషా ఇంటర్ రెండవ సంవత్సరం మధ్యలోనే ఆపేసినట్లు పోలీసులు చెప్పారు. ఆమె కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లల్లో, స్నేహితుల ఇళ్లల్లో అడిగి తెలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details