తెలంగాణ

telangana

ETV Bharat / state

సూరారం కాలనీలో యువతి దారుణ హత్య - murder

నమ్మివచ్చిన ఓ యువతిని అత్యంత దారుణంగా హత్యచేశాడో కిరాతకుడు. ఆమె తెచ్చుకున్న  పెట్టెలోనే మృతదేహాన్ని కుక్కి మురికి కాలువలో పడేశాడు. ఏమీ ఎరగనట్టు నటిస్తూ చివరికి పోలీసులకు చిక్కాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన హైదరాబాద్​లోని సూరారం ప్రాంతంలో చోటుచేసుకుంది.

సూరారం కాలనీలో యువతి దారుణ హత్య

By

Published : Apr 14, 2019, 10:36 AM IST

హైదరాబాద్​లోని సూరారంలో దారుణం జరిగింది. నమ్మి వచ్చిన ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసి లగేజీ బ్యాగులో పెట్టి మురికి కాలువలో పడేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వారం కిందట రామచంద్రపురానికి చెందిన ఓ యువతి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ యువతికి సూరారంలోని ఓ వ్యక్తితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటపెట్టాడు.

తాను తెచ్చుకున్న పెట్టెలోనే

పోలీసుల విచారణలో నిందితుడు యువతిని హత్యచేసినట్లు అంగీకరించాడు. ఆమె తెచ్చుకున్న పెట్టెలోని బట్టలు పడేసి అందులోనే మృతదేహాన్ని పెట్టి సూరారం కాలనీలోని కృషి పాఠశాల పక్కనున్న మురికి కాలువలో పడేసినట్లు వివరించాడు.

క్లూస్​ టీం మురికి కాలువలోని లగేజీ బ్యాగ్​ తెరిచి చూడగా పాడైపోయిన స్థితిలో మృతదేహం ఉంది. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సూరారం కాలనీలో యువతి దారుణ హత్య
ఇదీ చదవండి: నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details