తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ కేసులను ఎత్తివేయండి

సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తాండ గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని లంబాడి పోరాట హక్కుల సమితి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్​ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన తెలియజేశారు.

అక్రమ కేసులను ఎత్తివేయండి

By

Published : Sep 21, 2019, 11:22 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తాండకి చెందిన 40మంది గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అమానుషమని లంబాడి హక్కుల పోరాట సమితి విద్యార్థి నేతలు ఆరోపించారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారి భూములను పారిశ్రామిక వేత్తలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 100 మందిని బరిలో నిలుపుతామని హెచ్చరించారు.

అక్రమ కేసులను ఎత్తివేయండి
ఇదీచూడండి: కన్నెపల్లిలో 10వ పంప్‌తో గోదావరి జలాల ఎత్తిపోత

ABOUT THE AUTHOR

...view details