గిరిజన శక్తి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'కార్పొరేట్ విద్య- ప్రైవేటీకరణ' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. అనేక విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని లక్షల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. అనుమతులు లేకుండా ఉన్న వాటిని మూసి వేయాలన్నారు. కనీస మౌలిక వసతులు కల్పించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి - చర్యలు తీసుకోవాలి
విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలంటూ, మౌళిక వసతులు లేని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకువచ్చే యోచనలో ఉన్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి : వాన లేక రైతులు తల్లడిల్లుతున్నారు తల్లీ..!