మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు 5 వేల జరిమానా చెల్లించాలని జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నోటీసులు జారీచేసింది.
కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా - కౌటౌట్
16:46 February 15
మంత్రి తలసానికి జరిమానా
మంత్రి తలసాని ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నెక్లెస్ రోడ్డులో వీ లవ్ కేసీఆర్ అంటూ భారీ కౌటౌట్ ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వల్ల జరిమానా విధించినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు.
నగరాన్ని పరిశుభ్రమైన.. సుందర వనమైన నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరుతోంది.
ఇదీ చూడండి:ప్లాస్టిక్ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్ అవగాహన