జీహెచ్ఎంసీ నూతన పాలకమండలి ఆధ్వర్యంలో తొలి సర్వసభ్య సమావేశం (GHMC Plenary Session) జరిగింది. మేయర్ విజయలక్ష్మి (GHMC Mayor Vijaya Lakshmi) అధ్యక్షతన... తొలిసారి వర్చువల్ విధానంలో చర్చ నిర్వహించారు. సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు పాల్గొన్నారు. స్థాయీ సంఘం గతేడాది డిసెంబరులో ఆమోదించిన 2021-22 ఆర్థిక సంవత్సరం(Financial year) పద్దును ఆమోదించడమే ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది.
జనవరిలోనే ఆమోదం పొందాలి కానీ..
షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది జనవరిలో ఈ పద్దు ఆమోదం పొందాలి. కొత్త పాలక మండలికి అదే సమయంలో ఎన్నికలు జరగడంతో సమావేశం వాయిదా పడింది. అనంతరం కొవిడ్ రెండో దశ వ్యాప్తి కారణంగా సమావేశం జరగలేదు. వ్యాప్తి తగ్గుముఖం పడటంతో... తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించి... రూ.5,600 కోట్ల పద్దును ప్రవేశపెట్టారు. సమగ్ర చర్చల అనంతరం సభ్యులు పద్దుకు ఆమోదం తెలిపారు.
కొవిడ్ దృష్ట్యా సర్వసభ్య సమావేశాన్ని తొలిసారి వర్చువల్గా నిర్వహించాం. కార్పొరేటర్ల జాగ్రత్త కోసం సమావేశం వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. రూ. 5,600 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాను. ఇదే కాకుండా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాం.