తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​ ఆదేశాలతో బల్దియా అధికారుల బస్తీ బాట

మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో ఇవాళ జీహెచ్​ఎంసీ మేయర్​తోపాటు అధికారులు బస్తీ బాట పట్టారు. ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తున్నారు.

By

Published : Sep 10, 2019, 11:56 AM IST

GHMC Officers

గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్​ఎంసీ మేయర్​తోపాటు అధికారులు బస్తీ బాట పట్టారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశాలతో ఇవాళ తార్నాక డివిజన్​లోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నారు. సీజనల్​ వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పిస్తూ...తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. ప్రధానంగా మలేరియా, డెంగీ ప్రబలిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హెచ్‌ఎండీఏ వద్ద ఉన్న బస్ బే నిర్మాణంలో మార్పులు చేయాలని మేయర్​ బొంతు రామ్మోహన్​ అధికారులకు సూచించారు. బస్తీ దవాఖానాల్లో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. డెంగీ, మలేరియా రోగుల ఇళ్లలో లార్వా నివారణ మందుల పిచికారీ చేయించడమే కాకుండా పారిశుద్ధ్యంపై స్వచ్ఛ ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

కేటీఆర్​ ఆదేశాలతో బస్తీ బాట పట్టిన బల్దియా అధికారులు
ఇవీ చూడండి:హిమాచల్​ ప్రదేశ్​కు కుటుంబసమేతంగా పయనమైన దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details