బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని శ్మశాన వాటికను రూ.కోటి 50 లక్షల వ్యయంతో మహా ప్రస్థానంగా తీర్చి దిద్దుతామని మేయర్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె నగరంలోని పలు శ్మశాన వాటికలను సందర్శించారు. శ్రీరామ్ నగర్లో చేపడుతోన్న మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు.
శ్మశాన వాటికలను సందర్శించిన మేయర్
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి.... నగరంలోని పలు శ్మశాన వాటికలను సందర్శించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని శ్మశాన వాటికను.. మహా ప్రస్థానంగా తీర్చి దిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు.
సల్మాన్ అనే యువకుడు ట్విట్టర్ ద్వారా చేసిన ఫిర్యాదుతో.. మేయర్ భోజగుట్ట శ్మశాన వాటికను సందర్శించారు. అందులో పేరుకు పోయిన చెత్తను ఎత్తి వేయించారు. ప్రహారీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయనగర్ కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్.. స్థానికులు చెత్తను రోడ్డు మీద వేయకుండా ఆయా ప్రదేశాల్లో మొక్కలు నాటించి, ఫుట్‌పాత్ కట్టించాలన్నారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికను సందర్శించి.. పెండిగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:'ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలు ప్రకటించండి'