కూకట్పల్లి నుంచి హైటెక్‌సిటీ వైపునకు ప్రయాణించే వాహనాల ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జిని రూ.59 కోట్లతో నిర్మించామని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆర్ఓబీతో పాటు స్టార్మ్ వాటర్ సంపును పరిశీలించారు.
రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన హైదరాబాద్ మేయర్ - రైల్వే అండర్ బ్రిడ్జి వార్తలు
కూకట్పల్లి జోన్‌లోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులను హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఆర్ఓబీని ఏప్రిల్ 5న ప్రారంభించనున్నామని తెలిపారు.
రైల్వే అండర్ బ్రిడ్జి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
ఆర్ఓబీని ఏప్రిల్ 5న ప్రారంభించనున్నామని మేయర్ అన్నారు. వర్షపు నీటిని భద్రపరిచి ఉపయోగించేందుకు ఈ బ్రిడ్జ్ వద్ద సంపును నిర్మించామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి:దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్