తెలంగాణ

telangana

ETV Bharat / state

వాడీవేడిగా జీహెచ్​ఎంసీ సమావేశం - మేయర్​ బొంతు రామ్మోహన్

జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని రోడ్ల విషయంలో, పలు అభివృద్ధి పనుల్లోనూ ఐఏఎస్​లు, జోనల్​ కమిషనర్​లు అలసత్వం చూపుతున్నారని ఘాటు విమర్శలు గుప్పించారు.

వాడివేడిగా జీహెచ్​ఎంసీ సమావేశం

By

Published : Aug 8, 2019, 9:30 PM IST

జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర కార్పొరేషన్ అధికారుల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. కిందిస్థాయి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నగరంలో రోడ్లు, గుంతలపై కార్పొరేటర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. తాము ఫోన్ చేస్తే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించడంలేదని పేర్కొన్నారు.

రోడ్లనిర్వహణలో... కమిషనర్​ల ఏసీ సమీక్షలు
హైదరాబాద్‌ రోడ్ల నిర్వహణ విషయంలో రోడ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తోందని ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. ఐఏఎస్‌, జోనల్ కమిషనర్‌లపై ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐఏఎస్‌లు, జోనల్ కమిషనర్లు ఏసీ గదుల్లో సమీక్షలకే పరిమతమవుతున్నారని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ వ్యాఖ్యలతో అధికారులు నిరసన తెలిపేందుకు సిద్ధమవ్వగా మేయర్​ బొంతు రామ్మోహన్​ విజ్ఞప్తితో వివాదం సద్దుమనిగింది. ప్రజాప్రతినిధులకు కలిగిన అసౌకర్యానికి కమిషనర్ దాన కిశోర్ క్షమాపణలు చెప్పారు.

విల్లాల విలాసమంతం...
ఎమ్మార్ ప్రాపర్టీలోని విల్లాలపై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. నగరంలో ముఖేశ్ గౌడ్‌, జైపాల్‌ రెడ్డి, సుష్మా స్వరాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు.

వాడీవేడిగా జీహెచ్​ఎంసీ సమావేశం

ఇదీ చూడండి :వేగంగా సచివాలయం తరలింపు ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details