తెలంగాణ

telangana

ETV Bharat / state

332 మందికి రూ.4,34,600 జరిమానా - ghmc

హైదరాబాద్​లో నిబంధనలకు విరుద్ధంగా శుభ్రతకు భంగం కలిగించిన 332 మందికి  రూ.4,34,600 జరిమానా విధించింది జీహెచ్​ఎంసీ. 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్​ వాడడం, బహిరంగ మూత్రవిసర్జన, రోడ్లపై చెత్త వేయడం వంటి వాటికి ఫైన్​ వేసింది.

జీహెచ్​ఎంసీ

By

Published : Jun 1, 2019, 8:51 PM IST

332 మందికి రూ.4,34,600 జరిమానా

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీహెచ్​ఎంసీ కోరడా ఝులిపించింది. 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్​ వాడడం, బహిరంగ మూత్రవిసర్జన, రోడ్లపై చెత్త వేసిన 332 మందికి 4 లక్షల 34 వేల 600 రూపాయల జరిమానా విధించింది. న‌గ‌రంలో సంపూర్ణ స్వచ్ఛత‌కై ప్రారంభించిన సాఫ్ హైద‌రాబాద్ - షాన్‌దార్ హైద‌రాబాద్‌లో భాగంగా స్వచ్ఛ కార్యక్రమాల‌ు చేపడుతున్న నగరపాలక సంస్థ నిబంధనలు అతిక్రమించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా రోడ్లపై చెత్తను వేయ‌డం, దుకాణాల య‌జ‌మానులు, ఇత‌రులు చెత్తను త‌గ‌ల‌బెట్టడం, భ‌వ‌న నిర్మాణ వ్యర్థాల‌ను ర‌హ‌దారుల‌పై అక్రమంగా వేయ‌డం త‌దిత‌ర చ‌ర్యల‌కు ఫైన్​ వేయనుంది. జరిమానా విధించ‌డానికి డీప్యూటీ క‌మిష‌న‌ర్ల‌ను చీఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా, అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌ను అడిష‌న‌ల్ చీఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా, వార్డు స్థాయిలో శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా నియ‌మించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details