జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికారులతో లోకేశ్‌కుమార్ భేటీ - జీహెచ్ఎంసీ ఎన్నికలు
13:09 September 22
లోకేశ్‌కుమార్ భేటీ
జీహెచ్ఎంసీ ఎన్నికలకు యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ నోడల్ అధికాలు, విభాగాధిపతులతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, జాబితా, ప్రింటింగ్, ఇతర సిబ్బంది నియామకంపై చర్చించారు.
సిబ్బందికి శిక్షణ, వెబ్ కాస్టింగ్, నియమావళి బృందాల నియామకంపై పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలు, వసతులు, ఇతర అంశాలపై నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నోటిఫికేషన్ వచ్చేలోగా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని లోకేశ్‌కుమార్ సూచించారు. ఎస్ఈసీ ఉత్తర్వులను, నిబంధనలను నిత్యం పరిశీలించాలన్నారు.