తెలంగాణ

telangana

ETV Bharat / state

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి... అక్టోబర్​లో పూర్తి

సిమెంట్​ కాంక్రీట్​ ఆధునిక టెక్నాలజీతో భాగ్యనగరంలో నిర్మిస్తున్న కేబుల్​ బ్రిడ్జి నిర్మాణం ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఈ వంతెనతో భాగ్యనగర పర్యటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. అత్యాధునిక సాంకేతికతో ఎన్నో హంగులతో నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జి అక్టోబర్​లోగా పూర్తికానుంది.

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి... అక్టోబర్​లో పూర్తి

By

Published : Jun 15, 2019, 1:11 PM IST

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి... అక్టోబర్​లో పూర్తి

దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి నిర్మాణ పనులు అక్టోబర్​లోగా పూర్తికానున్నాయని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ అన్నారు. దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి నిర్మాణ పనులను పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్​తో పాటు పరిశీలించారు.

పర్యటక రంగానికి ఆకర్షణ దుర్గం చెరువు

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిలో కాలినడక దారి, సైక్లింగ్ ట్రాక్​తో పాటు అత్యాధునిక ఆకర్షణీయమైన లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర పర్యటక రంగానికి దుర్గం చెరువు సరికొత్త ఆకర్షణగా రూపొందనుందని పేర్కొన్నారు. ఇప్పటికే దుర్గం చెరువు పనుల్లో 2 మిలియన్ సురక్షిత పని గంటలు పూర్తి చేయడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించామన్నారు.

బ్రిడ్జికి ఇరువైపులా స్టీల్​ రేలింగ్

మొత్తం 53 సెగ్మెంట్ల కూర్పుగాను మరో 40 సెగ్మెంట్లను అమర్చాల్సి ఉందని... కేవలం రాత్రి వేళల్లో మాత్రమే కొండాపూర్ క్యాస్టింగ్ యాడ్ నుంచి రవాణా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దుర్గం చెరువు బ్రిడ్జికి ఇరువైపులా ఆధునిక పద్ధతిలో ఆకర్షణీయమైన స్టీల్ రేలింగ్​ను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ దానకిశోర్ తెలిపారు.

ఇదీ చూడండి : అవినీతిపై హైతీలో మిన్నంటిన ఆగ్రహ జ్వాల

ABOUT THE AUTHOR

...view details