ఏయే కంపెనీలు ఎంతెంత..?
'15కోట్ల టవర్ల బకాయిలు వెంటనే కట్టండి' - DANA KISHORE
ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉంచిన బకాయిలను వెంటనే కట్టాలని జీఎహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సెల్యులర్ టవర్ల యాజమాన్యాలకు తెలిపారు.
ఏటీసి టెలికాం సంస్థ 15 లక్షల 96 వేలు, వియోమ్ సంస్థ 2 కోట్ల 58 లక్షల 88వేలు, రిలయన్స్ జియో 3 కోట్ల 48 లక్షల 61 వేలు, అసెండ్ టెలికాం ఇన్ ఫ్రా 74 లక్షల 27 వేలు, బీఎస్ఎన్ఎల్ 2 కోట్ల 25 లక్షల 77 వేలు చెల్లించాల్సి ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. చెన్నీ నెట్వర్క్ 84 లక్షల 31 వేలు, జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90 లక్షల 71 వేలు, ఐడియా 5 లక్షల 94 వేలు, రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ 3 కోట్లు 27 లక్షల 85 వేలు, టవర్ విజన్ 35లక్షల 92 వేలు, సారయ్య టవర్స్ 18వేలు, భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ 46 వేల బకాయిలున్నాయని దానకిషోర్ స్పష్టం చేశారు.