హైదరాబాద్ సోమాజిగూడలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రం విభజన హామీలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ పాత్రికేయులు పల్లె రవి సారథ్యంలో ఆ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ స్తబ్ధత ఏర్పడిందని, మరోమారు తెలంగాణ పౌర హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.
మరో పోరాటానికి సిద్ధం కండి - హైదరాబాద్ తాజా వార్తలు
దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అన్నీ రాజకీయ పార్టీలు తమ జెండాలు, ఎజెండాలను పక్కకు పెట్టి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చాయి. సోమాజిగూడలో జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం విభజన హామీలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
విభజన హామీలను సాధించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడం ఏమో కానీ, అప్పుల తెలంగాణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెజస అధ్యక్షుడు ప్రొ.కొదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ నేత మధుయాష్కి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగతో పాటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మద్దతు ధర కోసం కదంతొక్కిన పసుపు రైతులు