తెలంగాణ

telangana

ETV Bharat / state

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో ముగ్గురు బాలురు బెయిల్​పై విడుదల - జూబ్లీహిల్స్ కేసు తాజా వార్తలు

Jubilee Hills Case updates: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ముగ్గురు బాలురు నిన్న బెయిల్​పై విడుదలయ్యారు. మరో బాలుడు నేడు విడుదల కానున్నాడు.

Jubilee Hills Case
Jubilee Hills Case

By

Published : Jul 27, 2022, 10:14 AM IST

Updated : Jul 27, 2022, 12:06 PM IST

Jubilee Hills Case updates: రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ముగ్గురు మైనర్ బాలురు బెయిల్​పై విడుదలయ్యారు. మరో మైనర్ బాలుడి బెయిల్ పత్రాల్లో చిన్న మార్పులుండటం వల్ల ఈ రోజు సాయంత్రంలోపు విడుదల కానున్నారు. సైదాబాద్​లోని జువైనల్ హోంలో ఉన్న ముగ్గురు మైనర్ బాలురు నిన్న రాత్రి విడుదలయ్యారు. మొత్తం ఐదుగురు మైనర్ బాలురకుగాను నలుగురికి బెయిల్ మంజూరైంది.

మరో మైనర్ బాలుడి బెయిల్ పిటీషన్ హైకోర్టులో పెండింగ్​లో ఉంది. ఈ రోజు దానిపై విచారణ కొనసాగనుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ బెయిల్ సైతం హైకోర్టులో పెండింగ్​లో ఉంది. సాదుద్దీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మే28న మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో సాదుద్దీన్ తో పాటు.. మరో ఐదుగురు మైనర్ బాలురను జూబ్లీహిల్స్ పోలీసులు జూన్5న అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

మరో వారం రోజుల్లో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డీఎన్ఏ నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్ పంపించిన పోలీసులు తగిన ఆధారాలు సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డీఎన్ఏను.. ఎఫ్ఎస్ఎల్ అధికారులు గుర్తించారు. కారులోనూ ఆరుగురి డీఎన్ఏ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

అంతే కాకుండా సీసీటీపీ దృశ్యాలతో పాటు.. మైనర్ బాలురు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ సెల్​ఫోన్​లను కూడా పోలీసులు పరిశీలించారు. అత్యాచారం జరిగిన సమయంలో అదే లోకేషన్​లో వీళ్లందరి సెల్​ఫోన్​లు ఉన్నట్లు సాంకేతికత ఆధారాల ద్వారా గుర్తించారు. లైంగిక పటుత్వ పరీక్షల్లోనూ వైద్యులు అందరికీ సామర్ధ్యం ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ నేరాభియోగ పత్రంలో దాఖలు చేయనున్నారు.

మైనర్ బాలురను మేజర్లుగా పరిగణించి.. విచారణ చేయాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. తీవ్రనేరం చేసినందుకు గాను మైనర్లను మేజర్లుగా పరిగణించి తగిన శిక్ష వేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు నేరాభియోగపత్రంలో బోర్డును అభ్యర్థించనున్నారు.

Last Updated : Jul 27, 2022, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details