సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హృద్రోగ సమస్యతోమంగళవారంఓ బాబు మృతి చెందాడు. దీనికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాబు నాన్నమ్మ, బంధువులు డాక్టర్ కార్తీక్‌పై దాడికి పాల్పడ్డారు. వార్డులోని అద్దాలు పగలగొట్టారు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.
వైద్యులపై దాడిని ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా ఖండించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఎలా పంపించేశారని పోలీసులపై మండిపడ్డారు. వైద్యులకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి నుంచి గాంధీ ఆసుపత్రిలో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం రక్షణ కల్పించేలా హామీ ఇచ్చేవరకు నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు.
గాంధీ సాక్షిగా.. - డిమాండ్
గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్లపై దాడులు చేయడాన్ని తప్పుబట్టారు. వైద్యులకు రక్షణ కరవైందని నిరసనలు కొనసాగిస్తున్నారు.
వైద్యులపై దాడులా?
ఇదీ చదవండిస్నేహమే యమపాశమై
Last Updated : Feb 27, 2019, 1:24 PM IST