తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రి వైద్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గాంధీ ఆసుపత్రిలో శానిటేషన్ విభాగానికి చెందిన కార్మికులకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, ఆర్ఎంవోలు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
దాతృత్వాన్ని చాటుకున్న గాంధీ వైద్యులు - Groceries Distribution to Sanitary workers
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలోని శానిటేషన్ విభాాగానికి చెందిన కార్మికులకు నిత్యావసర సరకులు అందజేశారు.
దాతృత్వాన్ని చాటుకున్న గాంధీ వైద్యులు
దాదాపు 15 రోజులకు సరిపడా సరకులను అందజేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్యులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది కూడా తమ వంతు కృషి చేస్తూ వైరస్ నిర్మూలనకు పాటు పడుతున్నారని డాక్టర్లు అన్నారు. శానిటేషన్ విభాగానికి చెందిన కార్మికులను ఎలాంటి కష్టం లేకుండా అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని అన్నారు.
ఇవీ చూడండి: పరిమళించిన మానవత్వం... మురళి తీరు అభినందనీయం