హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ అనుచరులు బీభత్సం సృష్టించారు. కార్పొరేటర్ నివాసం నుంచి వీవీనగర్ కాలనీ రోడ్డుపై డీజే పెట్టి ద్విచక్రవాహనాలు నిలపివేశారు. కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.
ఇళ్లకు అడ్డుగా ఉన్న ద్విచక్రవాహనాలను పక్కకు తీయాలని కోరిన స్థానికులను నానా బూతులు తిట్టారు. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను పడేసి హంగామా చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఇంటికి అడ్డంగా పెట్టిన వాహనాన్ని తీయమని అడిగిన సిద్దార్థ అనే వ్యక్తిని, అతని తల్లి శాంతిపై దాడికి దిగినట్లు ఆమె తెలిపింది. ఇంట్లో చొరబడి సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి పిలువలేదని.. 30 వేలు అడిగితే ఇవ్వలేదని కక్షతో తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది.