Gaddam Prasad Kumar Nomination Today :తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం రోజు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే బరిలో నిలిచారు. మిగతా పార్టీలేవీ తమ అభ్యర్థులను నిలపలేదు. గడ్డం ప్రసాద్ కుమార్‌కు కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. ఎంఐఎం సైతం తమ మద్దతును ప్రకటించింది. స్పీకర్ ఎన్నికను ఈరోజు అధికారికంగా ప్రకటిస్తారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభంలో గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
కాంగ్రెస్ తరఫున బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతి పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్షం నుంచి కేటీఆర్ గడ్డం ప్రసాద్‌ను ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై సంతకం చేశారు. సీఎల్పీ సమాచారంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దూరంగా ఉన్నారు.
Telangana Assembly Speaker Election 2023 : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. సభాపతిగా ప్రసాద్ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానుండడం విశేషం. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నేడు గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు.