తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులనే గెలిపించండి' - ప్రెస్ క్లబ్‌

బహుజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులనే గెలిపించుకోవాలని సౌత్ ఇండియా పొలిటికల్ ఐకాస ఛైర్మన్ ప్రొ.గాలి వినోద్ కుమార్ సూచించారు. ఏ అభివృద్ధి చేయని మాజీ ఎమ్మెల్సీలు.. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, రాంచందర్ రావులు మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని వినోద్‌ ప్రశ్నించారు.

gaali vinod kumar on mlc candidates
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులను గెలిపించండి'

By

Published : Mar 1, 2021, 12:18 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే బహుజనులను గెలిపించుకోవాలని సౌత్ ఇండియా పొలిటికల్ ఐకాస ఛైర్మన్ ప్రొ.గాలి వినోద్ కుమార్ కోరారు. హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బహుజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే.. బహుజన అభ్యర్థులనే గెలిపించుకోవాలని వినోద్ సూచించారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు.. అభ్యర్ధులు ప్రొఫెసర్ కె.రామకృష్ణ , ఫణీంద్ర భార్గవ్‌లకు ఓటు వేయాల్సిందిగా కోరారు. ఏ అభివృద్ధి చేయని మాజీ ఎమ్మెల్సీలు.. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, రాంచందర్ రావులు మళ్లీ ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికలు.. అధికార, విపక్ష పార్టీల వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details