తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి - Ts health bulliten

ఇప్పటి నుంచి తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్యను వారంలో ఒకసారి మాత్రమే వెల్లడించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా కేసుల్లో పెద్దగా మార్పులు లేని కారణంగా... వారానికి ఒకసారి మాత్రమే వివరాలు తెలపాలని ప్రజారోగ్య సంచాలకులు ప్రకటన విడుదల చేశారు.

ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి
ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి

By

Published : Feb 23, 2021, 9:33 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులలో కొన్ని రోజులుగా పెద్దగా మార్పు లేని కారణంగా ఇకపై వారానికి ఒక్కరోజు మాత్రమే కరోనా కేసుల వివరాలను వెల్లడించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకులు ఓ ప్రకటన విడుదల చేశారు.

దాదాపు ఏడాది కాలంగా కొవిడ్ కేసుల వివరాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిబ్బందిని వాక్సినేషన్ కోసం వినియోగించే లక్ష్యంతో ఈ మేరకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రతి వారం జిల్లాల్లో నమోదైన మొత్తం కేసుల వివరాలతో పాటు ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి వివరాలు, హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి వివరాలను తెలపనున్నారు.

ఇదీ చూడండి:భాజపా సునామీలో తెరాస గల్లంతు ఖాయం: తరుణ్​చుగ్

ABOUT THE AUTHOR

...view details