తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 'ఫ్రీడం రన్‌'

స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా... ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను సగర్వంగా నిర్వహించుకుంటున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని.. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. రెండోవారంలో.. రవీంద్రభారతిలో కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ ఛైర్మన్ కె. వి. రమణాచారి తెలిపారు.

Freedom Run programme conducted in all districts in state as part of Azadi ka Amrit Mahotsav
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 'ఫ్రీడం రన్‌'

By

Published : Mar 24, 2021, 6:52 AM IST

అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో 'ఫ్రీడం రన్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, అమృతోత్సవాల కమిటీ ఛైర్మన్ కె.వి. రమణాచారి తెలిపారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రెండో వారంలో.. రవీంద్రభారతిలో కవి సమ్మేళనం, మూడో వారంలో.. రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల త్యాగాలు.. అజరామరమని కొనియాడారు సీఎం కేసీఆర్​. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులకు మంగళవారం ఆయన నివాళులర్పించారు. స్వాతంత్ర్యం సాధించి ఏళ్లు అవుతున్న సందర్భంగా... ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను సగర్వంగా నిర్వహించుకుంటున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:నాగార్జునసాగర్ అభ్యర్థి ఎంపికపై సీఎం సమాలోచనలు ​

ABOUT THE AUTHOR

...view details