ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ సీఎండీ సునిల్ శర్మ తెలిపారు. కిడ్నీ బాధితులు సుమారు 7,600మంది ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు.. హైదరాబాద్, వరంగల్లో సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్లలో ఉచిత ప్రయాణం చేసే వీలు కల్పించారు. ఇందుకు ఆర్టీసీపై పడే రూ.12.22కోట్ల రుణ భారాన్ని ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ కింద చెల్లించనుందని సీఎండీ వెల్లడించారు.