హైదరాబాద్ సైదాబాద్‌లోని గిరిజన బాలిక సంక్షేమ వసతిగృహంలో జనయిత్రి ఫౌండేషన్ సహకారంతో డాక్టర్ ఆనంద్ ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. దాదాపుగా 150 మంది బాలికలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులను అందజేశారు. ఈ కార్యక్రమానికి భారతదేశ తొలి గిరిజన మహిళా పైలట్ అజ్మీరా బాబీ ముఖ్య అతిథిగా హజరయ్యారు. రాబోయే రోజుల్లో మరిన్ని వైద్యశిబిరాలను నిర్వహిస్తామని జనయిత్రి ఫౌండేషన్ నిర్వాహకురాలు పుష్యమి దువ్వూరి పేర్కొన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఎస్టీ కార్పొరేషన్ సంయుక్త సంచాలకులు హన్మంతు నాయక్, వార్డెన్ వెరోనియా ధన్యవాదాలు తెలిపారు.
వసతిగృహంలో ఉచిత వైద్యశిబిరం - students
హైదరాబాద్ సైదాబాద్‌లోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో జనయిత్రి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 150 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి... మందులు అందజేశారు.
ఎస్టీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం