హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టాల్ ప్రారంభమయ్యింది. సంస్థ సభ్య కార్యదర్శి జి.వి. సుబ్రహ్మణ్యం ఆ స్టాల్ను ప్రారంభించారు. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ స్టాల్లో ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
నుమాయిష్లో ఉచిత న్యాయ సహాయం, సలహాలు
ఉచిత న్యాయ సహాయం కావాలనే వారికి మంచి అవకాశం.. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టాల్ ప్రారంభమైంది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ స్టాల్లో ఉచితంగా న్యాయ సలహాలు అందించనున్నారు.
నుమాయిష్లో ఉచిత న్యాయ సహాయం, సలహాలు
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 10 పథకాలను ప్రతిపాదించిందని, దానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆ స్టాల్ వేదికగా పని చేస్తుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. సుశిక్షితులైన న్యాయవాదులు ఇందులో సలహాలు అందించి, పలు వివాదాలను అక్కడే పరిష్కరిస్తారని చెప్పారు. రోజు రోజుకు ఖరీదవుతున్న న్యాయ సలహాలను ఈ స్టాల్ ద్వారా కక్షిదారులు ఉచితంగా పొందవచ్చని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'