ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఉచిత నేత్ర వైద్య శిబిరాన్నిప్రారంభించిన మంత్రి తలసాని
సనత్నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉచిత నేత్ర వైద్య శిబిరం, తలసాని శ్రీనివాస్ యాదవ్
వేలాది రూపాయలు ఖర్చు చేసి సరైన వైద్యం పొందలేకపోతున్న పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, తెరాస అధ్యక్షులు బాల్రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాలు లేనిదే రైతు ఆదాయం రెట్టింపు అసాధ్యం'